• facebook
  • whatsapp
  • telegram

గురుకుల విద్యార్థినులకు ‘ఇండస్‌ఇండ్‌’ సహకారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్య కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ‘ఇండస్‌ఇండ్‌’ బ్యాంక్‌ ముందుకు వచ్చింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మూడేళ్ల పాటు ఎంపిక చేసిన 81 గురుకుల విద్యాలయాల్లోని 37,212 మంది విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు కార్యక్రమాల బాధ్యతతో పాటు శానిటరీ నాప్కిన్స్‌, విటమిన్‌ మాత్రలు ఉచితంగా అందించనుందని గురుకులాల సొసైటీల కార్యదర్శులు ప్రవీణ్‌ కుమార్‌, మల్లయ్య బట్టు తెలిపారు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో ఏప్రిల్ 12న‌ జరిగిన కార్యక్రమంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలంగాణ స్టేట్‌ హెడ్‌ వినోద్‌ గుండ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినర్జీ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా గురుకులాల్లో 24 గంటల పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న పనేషియా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం సహాయంతో ఈ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Posted Date : 13-04-2021