• facebook
  • whatsapp
  • telegram

నైపర్‌లో మూడు కొత్త కోర్సులు 

నేచురల్‌ ప్రొడక్ట్స్, ఫార్మాకో ఇన్‌ఫర్మేటిక్స్, రెగ్యులేటరీ ఆఫైర్స్‌ విభాగాల్లో ఎంఎస్, పీహెచ్‌డీ 

కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌టుడే: నైపర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) హైదరాబాద్‌ 2021 - 22 విద్యా సంవత్సరం నుంచి 3 కొత్త కోర్సులను ప్రారంభించనుంది. నేచురల్‌ ప్రొడక్ట్స్, ఫార్మాకో ఇన్‌ఫర్మేటిక్స్, రెగ్యులేటరీ ఆఫైర్స్‌ విభాగాల్లో ఎంఎస్, పీహెచ్‌డీ కోసం జేఈఈ - 2021 పరీక్ష ద్వారా ప్రవేశాలను నిర్వహిస్తారు. ఫార్మసీ లేదా మెడికల్, బయోమెడికల్‌ విభాగాల్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులు. ఔషధాలు, వైద్య పరికరాల ఆవిష్కరణకు ఫార్మాకోజెనోమిక్స్, బయోటెక్నాలజీ, ఫైటో మెడిసిన్, న్యూట్రాస్యూటికల్స్‌ రంగాల్లో నిపుణులుగా ఎదగడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఈ కోర్సులు ఉపయోగపడతాయని వివరించారు.

Posted Date : 14-04-2021