• facebook
  • whatsapp
  • telegram

పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

బేగంపేట (అమీర్‌పేట), న్యూస్‌టుడే: పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డా.సునీత తెలిపారు. ఎంఏ (ఇంగ్లీషు), ఎంఏ (ఎకనామిక్స్‌), ఎంకాం (కామర్స్‌), ఎమ్మెస్సీ (గణితం), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 20లోపు కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీపీజీఈటీ కౌన్సెలింగ్‌లో కళాశాల అలాట్‌మెంట్‌ కాని విద్యార్థులు, ప్రవేశ పరీక్ష రాయనప్పటికీ.. డిగ్రీలో 50 శాతం మార్కులు పొందిన వారు స్పాట్‌ అడ్మిషన్లకు అర్హులన్నారు. కోర్సు ఫీజుతోపాటు రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఉపకార వేతనాలకు అనర్హులని తెలిపారు.

Posted Date : 16-04-2021