• facebook
  • whatsapp
  • telegram

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ఫెలోషిప్‌లు‌

 

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ)-మ‌ద్రాస్‌కు చెందిన రాబ‌ర్ట్ బాచ్ సెంట‌ర్ ఫ‌ర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, నారాయ‌ణన్‌ ఫ్యామిలీ ఫౌండేష‌న్‌తో క‌లిసి ఫెలోషిప్‌లు‌ ప్రారంభించింది. సామాజిక అవ‌స‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ఈ ఫెలోషిప్‌ల‌ను అందించ‌నుంది. పీహెచ్‌డీ చేసిన వారితోపాటు కంప్యూటర్ సైన్స్‌, కంప్యూటేష‌న‌ల్ అండ్ డేటా సైన్స్‌, బ‌యోమెడిక‌ల్ సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్ త‌దిత‌ర ఇంజినీరింగ్ బ్రాంచిల్లో రీసెర్చ్‌లు ప్రారంభించిన‌ వారిని ఈ ఫెలోషిప్‌ల‌కు ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

వెబ్‌సైట్‌: https://rbcdsai.iitm.ac.in/nf3/
 

Posted Date : 17-04-2021