• facebook
  • whatsapp
  • telegram

కొవిడ్‌ కాల్‌ సెంటర్‌లో ఉద్యోగాల‌కు ఇంటర్వ్యూలు

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గన్నవరం హెచ్‌సీఎల్‌లో నిర్వహిస్తున్న 104 కొవిడ్‌ కాల్‌ సెంటర్‌లో తాత్కాలిక ప్రతిపాదికన నియామకాలు చేపడుతున్నట్లు హెచ్‌సీఎల్‌ కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కాల్‌ సెంటర్‌లో పని చేసిన అనుభవం, ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్, పీజీ విద్యార్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 26న తొమ్మిది నుంచి 11 గంటల వరకు గన్నవరం హెచ్‌సీఎల్‌ క్యాంపస్‌లో నిర్వహించనున్న ఇంట‌ర్వ్యూలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80748 17158, 93462 21956 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

Posted Date : 26-04-2021