• facebook
  • whatsapp
  • telegram

విద్యాసంస్థలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలి

* ఫీజు బకాయిల కోసం ఆన్‌లైన్‌ లింక్‌ నిలిపివేస్తే ఫిర్యాదు చేయండి

* రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు 

 

 

ఈనాడు, అమరావతి: ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలకు రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నిర్వాహకులు కట్టుబడి ఉండాలని రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు మే 13న‌ పేర్కొన్నారు. వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నిర్వాహకులు ఫీజుల కోసం ఇబ్బంది పెడితే.. కమిషన్‌ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. పలు విద్యా సంస్థలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఆన్‌లైన్‌ లింక్‌ అందించటం లేదని కమిషన్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులతో విద్యా సంస్థలకు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజుల విషయంలో విద్యార్థులకు వెసులుబాటు కల్పించాలని సుప్రీంకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించింది. విద్యార్థులకు అందించని వసతులకు కూడా ఫీజుల రూపేణా వసూలు చేయటం లాభార్జనే అవుతుంది. కొవిడ్‌ వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించి ఫీజు బకాయిలున్నా మానవతా దృక్పథంతో ఆన్‌లైన్‌ పాఠాలకు అనుమతించాలి’ అని పేర్కొన్నారు.  
 

Posted Date : 13-05-2021