• facebook
  • whatsapp
  • telegram

ప‌రిశోధ‌న కేంద్రం ఏర్పాటుకు ఐఐటీహెచ్‌ క‌స‌ర‌త్తు

 

ఐఐటీ-హైద‌రాబాద్, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియ‌ల్ సైన్స్(నిమ్స్‌)-జ‌పాన్ సంయుక్తంగా మెటీరియ‌ల్ సైన్స్‌కు సంబంధించిన‌ ప‌రిశోధ‌న కేంద్రాన్ని ప్రారంభించ‌నున్నాయి. అందుకు అనుగుణంగా క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టాయి. క‌రోనా ఉద్ధృతి అనంత‌రం ప‌రిశోధ‌న కేంద్రాన్ని ప్రారంభించే అవ‌కాశం ఉంది. అయితే గ‌తేడాదే రెండు ఇన్‌స్టిట్యూష‌న్లు గ్రాడ్యుయేట్ స్కూల్ ప్రోగ్రామ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈమేర‌కు నిమ్స్‌లో డాక్టొర‌ల్ ప్రోగ్రామ్ చేసే విద్యార్థులకు తోడ్పాడు అందించ‌డంతోపాటు మెటీరియ‌ల్ సైన్స్ రంగంలో ప‌రిశోధ‌న‌ల‌కు ఈ కేంద్రం అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చ‌నుంది. రెండు విశ్వ‌విద్యాల‌యాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌నున్న ఈ కేంద్రంలో ఐఐటీహెచ్‌కు చెందిన ఫ్యాక‌ల్టీ, నిమ్స్‌ పీహెచ్‌డీ విద్యార్థులు మెటీరియ‌ల్ సైన్స్‌కు సంబంధించి త‌మ ప‌రిశోధ‌న‌ల‌ను కొన‌సాగించ‌నున్నారు. ఈ ప‌రిశోధ‌న కేంద్రంతో భ‌విష్య‌త్తులో భార‌త్‌-జ‌పాన్ మెటీరియ‌ల్స్ టెక్నాల‌జీ విస్తృత‌మ‌వుతుంద‌ని భావిస్తున్నారు.  

Posted Date : 15-05-2021