• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈ టెన్త్‌ మార్కుల కేటాయింపు గడువు పెంపు

* పాఠశాలలకు సీబీఎస్‌ఈ తాజా ఆదేశాలు

దిల్లీ: సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు మరింత జాప్యం కానుంది. జూన్‌ 11 నాటికి ఈ క్రతువును పూర్తిచేయాలని, 20న ఫలితాలను వెల్లడిస్తామని ఇంతకుముందు ఆదేశించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఈ గడువును పెంచింది. జూన్‌ 30 నాటికి మార్కుల కేటాయింపును పూర్తిచేసి, తమకు జాబితాలను అందజేయాలని ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం, లాక్‌డౌన్‌ నిబంధనలు అమలవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణాధికారి సన్యం భరద్వాజ్‌ వెల్లడించారు.


 

Posted Date : 19-05-2021