తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఈసెట్)-2021 దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. రాష్ట్రంలోని కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో గడువును జూన్ 5 వరకు పెంచుతున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఆలస్య రుసుము లేకుండా జూన్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు రూ.500, ఇతరులు రూ.1000 చెల్లించాలి. పీజీఈసెట్‌ను జూన్ 19న నిర్వహించనున్నారు.
వెబ్సైట్: https://pgecet.tsche.ac.in/
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.