• facebook
  • whatsapp
  • telegram

ఫెలోషిప్‌ పూర్తికి గడువు పెంపు


 

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీ పూర్తై, వివిధ పథకాల కింద పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ (పీడీఎఫ్‌) చేస్తున్న విద్యార్థులు తమ పరిశోధనను పూర్తి చేసే గడువును ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు యూజీసీ వెల్లడించింది. కరోనా దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పొడిగింపు గడువుకు ఎటువంటి ఫెలోషిప్‌ చెల్లించరని స్పష్టం చేసింది.

Posted Date : 03-06-2021