• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ విద్యార్థుల‌కు నైపుణ్య పాఠ్యాంశాలు

 

విద్యార్థుల‌కు నైపుణ్య పాఠ్యాంశాల‌ను అందించేందుకు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) మైక్రోసాఫ్ట్‌తో జ‌త క‌ట్టింది. ఈమేర‌కు సీబీఎస్ఈ విధానంలో 6 నుంచి 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కోడింగ్‌, 8 నుంచి 12వ త‌గ‌ర‌తి విద్యార్థుల‌కు డేటా సైన్స్ పాఠ్యాంశాల‌ను బోధించనున్నారు. ఈ నైపుణ్య పాఠ్యాంశాలు 2021-22 విద్యాసంవ‌త్స‌రం నుంచి అందుబాటులోకి రానున్నాయి. నూత‌న విద్యావిధానం-2020లో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాల‌ను పెంపొందించేందుకు కొత్త పాఠ్యాంశాల‌ను ప్రవేశ‌పెట్టారు. కోడింగ్, డేటా సైన్స్ వ‌ల్ల విద్యార్థుల్లో ఆలోచ‌నా శ‌క్తి పెర‌గ‌డం, గ‌ణ‌న నైపుణ్యం, స‌మ‌స్య‌-ప‌రిస్కార నైపుణ్యాలు, సృజ‌నాత్మ‌క‌త‌, కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది.

Posted Date : 04-06-2021