• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో 12వ తరగతి ప్రాక్టికల్స్‌: సీబీఎస్‌ఈ 


 

దిల్లీ: కొవిడ్‌ కారణంగా 12వ తరగతి ప్రాక్టికల్స్‌ నిర్వహించలేని పాఠశాలలు, వాటిని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కులను ఆన్‌లైన్‌లో తాము పంపిన లింకు ద్వారా అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియను జూన్ 28 కల్లా పూర్తి చేయాలని పేర్కొంది. ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌ ఆన్‌లైన్‌ మాధ్యమంలో విద్యార్ధుల నుంచి వైవా తీసుకుంటారని, ఆ సమయంలో ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌ కూడా ఉండాలని స్పష్టం చేసింది. ఈ ముగ్గురు స్క్రీన్‌షాట్లు (విద్యారి, ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్, ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌) కూడా పాఠశాల రికార్డుల కోసం భద్రపరచాలని పేర్కొంది. ఆన్‌లైన్‌ పరీక్ష గురించి ముందుగానే విద్యార్ధులకు తెలపాలని.. సంబంధిత లింకును పరీక్ష రోజున మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది.

Posted Date : 08-06-2021