• facebook
  • whatsapp
  • telegram

శిక్షాశాస్త్రి, విద్యావారధి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ప్రారంభం

 

తిరుపతి విద్య, న్యూస్‌టుడే: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయంలో శిక్షాశాస్త్రి (బీఎడ్‌), విద్యావారధి (పీహెచ్‌డీ) ప్రవేశ పరీక్షలకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అధికారులు జూన్‌ 11న ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 12న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు 11న కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Posted Date : 12-06-2021