• facebook
  • whatsapp
  • telegram

మార్కుల ప్ర‌క్రియ‌పై సీబీఎస్ఈకి త్వ‌ర‌లో తుది నివేదిక‌!

 

దేశ‌వ్యాప్తంగా ర‌ద్దు చేసిన సీబీఎస్ఈ ప‌న్నెండో త‌ర‌గ‌తి ఫ‌లితాల వెల్ల‌డికి బోర్డు ఇప్ప‌టికే క‌స‌రత్తు మెద‌లుపెట్టింది. ఇందులో భాగంగా ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. 13మందితో కూడిన క‌మిటీలో కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి, యూజీసీ ఛైర్మ‌న్, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్ట‌ర్, సీబీఎస్ఈ కంట్రోల‌ర్‌, అక‌డ‌మిక్స్‌ డైరెక్ట‌ర్‌, ఐటీ డైరెక్ట‌ర్ త‌దిత‌రులు స‌భ్యులుగా ఉన్నారు. అయితే ప‌న్నెండో త‌ర‌గ‌తి ఫ‌లితాల వెల్ల‌డికి చేప‌ట్టాల్సిన విధానంపై ఈ క‌మిటీ ప‌రిశీల‌న జ‌రుపుతోంది. ఈమేర‌కు తుది నివేదిక‌ను జులై 18న సీబీఎస్ఈకి అందించ‌నుంది. దానికి అనుగుణంగా బోర్డు ఫలితాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. 

Posted Date : 15-06-2021