• facebook
  • whatsapp
  • telegram

25 వరకు ఎంటెక్‌ పరీక్షల ఫీజు గడువు

 


 

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎంటెక్‌ విద్యార్థుల పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ విడుదలైంది. వివరాలను జూన్ 16న‌ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి, అదనపు అధికారి డాక్టర్‌ ఎం.సురేఖ వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మొదటి సెమిస్టర్‌ విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 30వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జూన్‌ 30 వరకు ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని వివరించారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులతోపాటు మార్కుల్లో ప్రగతి కోరుకునేవారు ఫీజులను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో పరీక్షలు ఉంటాయన్నారు.

30 వరకు ఎల్‌ఎల్‌బీ..: కాకతీయ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్రం మూడో సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌ విద్యార్థులు జూన్‌ 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ తెలిపారు. రెగ్యులర్‌, ఇంప్రూవ్‌మెంట్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 5వ తేదీ వరకు ఫీజులు స్వీకరిస్తామన్నారు. జులై ఆఖరు వారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు.

25 వరకు బీఈడీ..: కాకతీయ విశ్వవిద్యాలయం రెగ్యులర్‌ బీఈడీ పరీక్షల ఫీజును జూన్ 25వ తేదీ వరకు చెల్లించాలని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బి.వెంకట్రాంరెడ్డి, అదనపు అధికారిణి డాక్టర్‌ ఎం.సురేఖ తెలిపారు. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులతో పాటుగా మార్కుల్లో ప్రగతి కోరుకునే వారు ఆలస్య రుసుం లేకుండా జూన్‌ 25వ తేదీలోగా ఫీజు చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జూన్‌ 30వ తేదీ వరకు ఫీజులను స్వీకరిస్తామన్నారు. ద్వితీయ సంవత్సర రెండో సెమిస్టర్‌, ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఫీజులను చెల్లించాలని పేర్కొన్నారు. జులై, ఆగస్టులో పరీక్షలు ఉంటాయన్నారు.

Posted Date : 17-06-2021