• facebook
  • whatsapp
  • telegram

కోస్ట్‌గార్డు యాంత్రిక్‌, నావిక్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

భార‌త నౌకాద‌ళంలో యాంత్రిక్‌/నావిక్(జ‌న‌ర‌ల్ డ్యూటీ, డొమెస్టిక్ డ్యూటీ) పోస్టుల భ‌ర్తీకి నిర్వ‌హించాల్సిన స్టేజ్‌-2 ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. షెడ్యూలు ప్ర‌కారం ఈ ప‌రీక్ష మార్చిలో జ‌ర‌గాల్సి ఉండ‌గా.. దేశంలో క‌రోనా నేప‌థ్యంలో వాయిదా ప‌డింది. తాజాగా జూన్ 29 నుంచి జులై 3 వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించాలని నిర్ణ‌యించారు.  ఈమేర‌కు అడ్మిట్ కార్డుల‌ను విడుద‌ల చేశారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు త‌మ హాల్‌టికెట్ల‌ను అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: joinindiancoastguard.cdac.in

Posted Date : 17-06-2021