• facebook
  • whatsapp
  • telegram

ప‌రీక్ష లేకుండానే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో ప్ర‌వేశాలు

 

దేశ‌విదేశాల్లో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యాల‌కు చెందిన యూజీ, పీజీ విద్యార్థులు ప్ర‌వేశ ప‌రీక్ష లేకుండానే కంపెనీ సెక్ర‌ట‌రీ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో చేర‌వ‌చ్చని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో పైన పేర్కొన్న విద్యార్థుల‌కు కంపెనీ సెక్ర‌టరీ ఎగ్జిక్యూటివ్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(సీఎస్ఈఈటీ) నుంచి విన‌హాయింపు ఇవ్వాల‌ని కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లో చేరాల‌నుకునే విద్యార్థులు యూజీ, పీజీలో త‌ప్ప‌నిస‌రిగా క‌నీసం 50శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించాలి. అయితే ఆయా విద్యార్థులు విడిగా రుసుము చెల్లించాల‌ని ఐసీఎస్ఐ పేర్కొంది. మ‌రోవైపు జులై 10న సీఎస్ఈఈటీ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

Posted Date : 24-06-2021