• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్ స‌ర్వీసెస్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

ఇండియ‌న్ ఇంజినీరింగ్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్(ప్రిలిమ్స్‌)-2021 అడ్మిట్ కార్డుల‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డుల‌ను యూపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులు జులై 18 సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ఈఎస్ఈ ప్రిలిమ్స్ ప‌రీక్షను జులై 18(ఆదివారం)న నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్‌-1(జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ ఇంజినీరింగ్ ఆప్టిట్యూట్‌) ప‌రీక్ష జ‌రుగుతుంది. దీన్ని 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. అలాగే మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పేప‌ర్-2(సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్ & టెలికామ్‌) ప‌రీక్ష 300 మార్కులకు జ‌రుగుతుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉంటుంది. 

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/


 

Posted Date : 24-06-2021