• facebook
  • whatsapp
  • telegram

28, 29 తేదీల్లో ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: డీఎస్సీ 2008కు సంబంధించి పాట్రన్‌ మారినందున ప్రభావితమైన ఎస్జీటీ అభ్యర్థులు తమ సరిఫికెట్ల పరిశీలన నిమిత్తం హాజరు కావాలని జిల్లా విద్యాశాఖాధికారిణి తహెరా సుల్తానా తెలిపారు. పాట్రన్‌ మార్పు వల్ల ప్రభావితులైన వారికి కాంట్రాక్ట్‌ బేసిస్‌లో మినిమం స్కేల్‌ ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వర్తించే జిల్లాలోని 136 మంది అభ్యర్థులు జూన్‌ 28, 29 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. విద్యార్హతకు సంబంధించిన ఒరిజనల్‌ సర్టిఫికెట్లు, డీఎస్సీ హల్‌టిక్కెట్, ర్యాంకు కార్డు, కులద్రువీకరణ, స్టడీ సర్టిఫికెట్లు రెండు సెట్ల కాపీలతో పాటు మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.
 

Posted Date : 25-06-2021