• facebook
  • whatsapp
  • telegram

ఇఫ్లూలో ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే  

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఆంగ్లం, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నట్లు అధికారులు జూన్‌ 29న ఒక ప్రకటన విడుదల చేశారు. జులైలో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను వారు ఖండించారు. కొంతమంది కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలకు ఇఫ్లూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 
 

Posted Date : 30-06-2021