• facebook
  • whatsapp
  • telegram

ఐఈఎస్‌, ఐఎస్ఎస్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

ఇండియ‌న్ ఎకాన‌మిక్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్(ఐఈఎస్‌)-2021, ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్‌(ఐఎస్ఎస్‌)-2021 అడ్మిట్ కార్డుల‌ను యూపీఎస్సీ విడుద‌ల చేసింది. షెడ్యూలు ప్ర‌కారం ఆయా ప‌రీక్ష‌లు జులై 16 నుంచి 18 వ‌ర‌కు జ‌రుగుతాయి. అభ్య‌ర్థులు త‌మ అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.  ఈ అవ‌కాశం జులై 18 వ‌ర‌కు ఉంటుంది. మొత్తం 26 పోస్టుల‌కు గానూ యూపీఎస్సీ దేశ‌వ్యాప్తంగా ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది. 

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

Posted Date : 30-06-2021