• facebook
  • whatsapp
  • telegram

కంపెనీ సెక్ర‌ట‌రీ ప్ర‌వేశ ప‌రీక్ష అడ్మిట్ కార్డులు

 

కంపెనీ సెక్ర‌ట‌రీ ఎగ్జిక్యూటివ్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(సీఎస్ఈఈటీ) అడ్మిట్ కార్డుల‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డుల‌ను ఐసీఎస్ఐ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. జులై 10న ప‌రీక్ష‌ జ‌ర‌గ‌నుంది. ఆన్‌లైన్ ద్వారా కేంద్రాల్లో నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. దేశంలో క‌రోనా నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఇంటి వ‌ద్ద నుంచే రాసేలా వీలు క‌ల్పించ‌నున్నారు. దీంతో అభ్య‌ర్థులు ఇంటి నుంచి త‌మ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్ ద్వారా ప‌రీక్ష రాయ‌వ‌చ్చు. స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌ను అనుమ‌తించ‌రు. 

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/home/

Posted Date : 30-06-2021