• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌లో వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులు 

 

 

గుంటూరు(జిల్లా పరిషత్‌), న్యూస్‌టుడే: కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక, దూర విద్య కేంద్రం ఇన్‌ఛార్జి డాక్టర్‌ కె.ఎస్‌.పూర్ణిమ జులై 2న తెలిపారు. సేంద్రియ వ్యవసాయం, తేనెటీగలు, మిద్దె తోటలు, పుట్టగొడుగుల పెంపకం కోర్సులకు రెండు నెలల వ్యవధిలో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు వర్శిటీ వెబ్‌సైట్‌ www.angrau.ac.in , లేదా 80087 88776 ఫోన్‌ నంబరులో సంప్రదించాలని సూచించారు. 

Posted Date : 02-07-2021