• facebook
  • whatsapp
  • telegram

జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన  

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీజీలో 55శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్‌ విద్యార్థులకు మాత్రం 50శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. ఆలస్య రుసుము లేకుండా  జులై 26లోపు దరఖాస్తు చేసుకునే వీలుంది.
 

Posted Date : 06-07-2021