• facebook
  • whatsapp
  • telegram

నాటా-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

ఐదేళ్ల బ్యాచిల‌ర్స్ ఆఫ్ ఆర్కిటెక్చ‌ర్‌లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే నేష‌న‌ల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫ‌ర్ ఆర్కిటెక్చ‌ర్(నాటా)-2021 రెండో విడత‌ ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. కౌన్సిల్ ఫ‌ర్ ఆర్కిటెక్చ‌ర్ ఈ ప‌రీక్ష నిర్వ‌హించనుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు నాటా అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జులై 11న ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. షెడ్యూలు ప్ర‌కారం జూన్ 12 జ‌ర‌గాల్సి ఉండ‌గా.. దేశంలో క‌రోనా విజృంభ‌న దృష్ట్యా వాయిదా ప‌డింది. నాటా మొద‌టి విడ‌త ప‌రీక్ష ఏప్రిల్ 10న జ‌రిగింది. 

వెబ్‌సైట్‌: https://www.nata.in/

Posted Date : 06-07-2021