• facebook
  • whatsapp
  • telegram

వైద్యులు, డిగ్రీ అధ్యాపక పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల‌ జాబితా విడుద‌ల‌


 

ఈనాడు, అమరావతి: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాలకు ఎంపికచేసిన ప్రాథమిక అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ జులై 08న‌ ప్రకటించింది. ఏపీ ఇన్స్యూరెన్స్‌ సర్వీస్‌ శాఖ అవసరాలకు ఈ ఉద్యోగాలను భర్తీచేస్తున్నారు.అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్లం, గణితం, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుల పోస్టులకు ఎంపికచేసిన అభ్యర్థుల జాబితానూ ఏపీపీఎస్సీ ప్రకటించింది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 
 

‣ 27న ధ్రువపత్రాల పరిశీలన

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే ఉద్యోగాలు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఆర్కియాలజీ), టెక్నికల్‌ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్‌) టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోజియాలజీ) ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జులై 27న ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు కార్యదర్శి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఒక ప్రకటన జారీచేశారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. 

Posted Date : 09-07-2021