• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌(ప్రిలిమ్స్‌)-2021 ప‌రీక్షా కేంద్రాల పెంపు

 

యూపీఎస్సీ అక్టోబ‌ర్ 10, 2021న నిర్వ‌హించ‌నున్న సివిల్స్‌(ప్రిలిమ్స్‌) ప‌రీక్షా కేంద్రాలు మ‌రో నాలుగు పెరిగాయి. ద‌ర‌ఖాస్తుల సంఖ్య భారీగా ఉండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈమేర‌కు అద‌నం  అల్మోరా(ఉత్త‌రాఖండ్‌), శ్రీన‌గ‌ర్‌(ఉత్త‌రాఖండ్‌), నాసిక్‌(మ‌హారాష్ట్ర), సూర‌త్‌(గుజ‌రాత్‌)లో ప‌రీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయా కేంద్రాల్లో ప‌రీక్ష రాయాల‌నుకునే వారు ఛాయిస్ ఆఫ్ సెంట‌ర్‌ను మార్చుకునే అవ‌కాశం క‌ల్పించింది. అందుకు వెబ్‌సైట్‌లో జులై 12-19 వ‌ర‌కు, జులై 26-30 వ‌ర‌కు ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఫ‌స్ట్ అప్లై-ఫ‌స్ట్ అలాట్ ప‌ద్ధ‌తిన ప్రాధాన్యం ఇస్తారు. యూపీఎస్సీ సివిల్స్ ప‌రీక్ష‌తోపాటు ఇండియ‌న్ పారెస్ట్ స‌ర్వీస్ ప‌రీక్ష‌ను కూడా అదే తేదీన నిర్వ‌హిస్తోంది. 

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


  

Posted Date : 10-07-2021