• facebook
  • whatsapp
  • telegram

నిమ్‌హాన్స్ ప్ర‌వేశ‌ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

​​​​​​​

 

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట‌ల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌)లో డీగ్రీ, పీజీ, పీహెచ్‌డీ త‌దిత‌ర కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. పీజీలో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష జులై 14, 15 తేదీల్లో జ‌ర‌గ‌నుండ‌గా.. అందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వ‌చ్చాయి. అభ్య‌ర్థులు నిమ్‌హాన్స్ వెబ్‌సైట్‌లో వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక డిగ్రీలో ప్ర‌వేశాల‌కు జులై 20న‌ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. దాని అడ్మిట్ కార్డులు త్వ‌ర‌లో విడుద‌ల‌వుతాయి. 

వెబ్‌సైట్‌: https://nimhans.ac.in/

Posted Date : 10-07-2021