• facebook
  • whatsapp
  • telegram

క్లాట్-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

దేశవ్యాప్తంగా న్యాయవిద్య ప్రవేశాల కోసం నిర్వ‌హించ‌నున్న‌ కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌)-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జులై 23 క్లాట్ ప‌రీక్ష‌ను జాతీయ లా విశ్వవిద్యాలయాల కన్సార్షియం నిర్వ‌హిస్తుంది. గ‌తంలోనే ప‌రీక్ష జర‌గాల్సి ఉండ‌గా.. కరోనా కారణంగా వాయిదా ప‌డింది. 

 

దేశంలో క‌రోనా కార‌ణంగా దూర ప్ర‌యాణం చేయ‌డానికి ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న అభ్య‌ర్థుల త‌ల్లిదండ్రుల‌ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిగ‌ణన‌లోకి తీసుకున్న క‌న్సార్షియం మ‌రో 18 ప‌రీక్షా కేంద్రాల‌ను పెంచింది. అందులో అమ‌రావ‌తి(మ‌హారాష్ట్ర), హుగ్లీ, హుబ్లీ/  ధ‌ర్వాడ్‌, పుదుచ్చేరి, రాజ‌మండ్రి, సాలెం, చిత్తూరు/  తిరుప‌తి, క‌ట‌క్‌, గ్వాలియ‌ర్‌, క‌న్యాకుమారి, కొట్టాయం, క‌ర్నూలు/  మంగ‌ళూరు, మీర‌ట్‌, సూర‌త్‌, తిరునెల్‌వెళ్లి, వ‌డోద‌ర‌, వెల్లూరు ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా మొత్తం 84 ప‌ట్ట‌ణాల్లో ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. 

వెబ్‌సైట్‌: https://consortiumofnlus.ac.in/

Posted Date : 14-07-2021