• facebook
  • whatsapp
  • telegram

సీఏపీఎఫ్‌-2021 అడ్మిట్ కార్డులు

 

బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎఎస్‌బీ కేంద్ర సాయుధ బలగాల్లోని అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వ‌హించ‌నున్న‌ సీఏపీఎఫ్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు త‌మ‌ అడ్మిట్ కార్డుల‌ను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ ప‌రీక్ష ఆగ‌స్టు 8న జ‌ర‌గ‌నుంది. అర్హ‌త డిగ్రీ కాగా.. మొత్తం 159 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రాతప‌రీక్ష, ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్/ మెడిక‌ల్ స్టాండ‌ర్డ్స్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ/ ప‌ర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

Posted Date : 14-07-2021