• facebook
  • whatsapp
  • telegram

ఐటీఐ కోర్సుల్లో చేరడానికి దరఖాస్తుల స్వీకరణ  

చార్మినార్, న్యూస్‌టుడే: తెలంగాణ ఉపాధి, శిక్షణశాఖలోని ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐలలోని కోర్సుల్లో చేరడానికి ఆన్‌లైన్‌ ద్వారా ఆడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ప్రభుత్వ ఓల్డ్‌ సిటీ ఐటీఐలోని వివిధ కోర్సుల్లో చేరడానికి ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ఓల్డ్‌ సిటీ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎస్‌.రేణుక ఒక ప్రకటనలో సూచించారు. 2021 ఏడాది అడ్మిషన్లలో భాగంగా ఓల్డ్‌సిటీ ఐటీఐలో డ్రాఫ్ట్‌మన్, సివిల్, కుట్టు సాంకేతిక, ప్లంబర్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, డీజిల్‌ మెకానిక్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్టు, మోటారు మెకానిక్‌ వాహనం నందు అడ్మిషన్ల కోసం డైరక్టర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డిపార్టుమెంట్‌ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎన్‌సీవీటీ పటాన్‌లోని ఆన్‌లైన్లో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అడ్మిషన్లు పొందవచ్చు iti.telangana.gov.in వెబ్‌సైట్‌ నందు దరఖాస్తు చేసుకోడానికి జులై 28వ తేదీ వరకు అవకాశం కల్పించారని స్పష్టం చేశారు.

Posted Date : 17-07-2021