• facebook
  • whatsapp
  • telegram

వృత్తి విద్యా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం


 

విశాలాక్షిన‌గ‌ర్‌, న్యూస్‌టుడే: విశాఖ‌ప‌ట్నం విశాలాక్షిన‌గ‌ర్‌లోని ద‌యాల్బాగ్ విద్యాకేంద్రం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న వృత్తి విద్యా కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు కోర్సు స‌మ‌న్వ‌య‌క‌ర్త ద‌క్షిణామూర్తి తెలిపారు. ఏడాది వ్య‌వ‌ధిగ‌ల కోర్సులు క‌టింగ్ అండ్ సూయింగ్, డ్రెస్  డిజైనింగ్, టెక్స్‌టైల్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, మోటారు వెహిక‌ల్ మెకానిక్‌, మోడ‌ర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌, 9 వారాల వ్య‌వ‌ధిగ‌ల కోర్సులు బ్లాక్ ప్రింటింగ్‌, టైఅండ్‌డై, స్క్రీన్ ప్రింటింగ్ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈ కోర్సుల్లో చేరాల‌న‌కున్న‌వారు ద‌ర‌ఖాస్తులు  వెబ్‌సైట్ నుంచి పొంద‌వ‌చ్చ‌న్నారు. మిగిలిన వివ‌రాల‌కు 9963340611 ఫోన్ నంబ‌ర్‌లో సంప్ర‌దించ‌వ‌చ్చ‌న్నారు.

Posted Date : 19-07-2021