• facebook
  • whatsapp
  • telegram

కంపెనీ సెక్ర‌ట‌రీ ప్ర‌వేశ ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల‌

 

కంపెనీ సెక్ర‌ట‌రీ ఎగ్జిక్యూటివ్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(సీఎస్ఈఈటీ) ఫ‌లితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ఐసీఎస్ఐ వెబ్‌సైట్‌లో త‌మ ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు. జులై 10, 12 తేదీల్లో ప‌రీక్ష జ‌రిగింది. ఆన్‌లైన్ ద్వారా కేంద్రాల్లో నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. దేశంలో క‌రోనా నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఇంటి వ‌ద్ద నుంచే రాసేలా వీలు క‌ల్పించారు. దీంతో అభ్య‌ర్థులు ఇంటి నుంచి త‌మ ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్ ద్వారా ప‌రీక్ష రాశారు. 

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/home/

Posted Date : 21-07-2021