• facebook
  • whatsapp
  • telegram

ఆగ‌స్టు 16 నుంచి సీబీఎస్ఈ బోర్డు ప‌రీక్ష‌లు

 

దేశంలో క‌రోనా కార‌ణంగా ప‌ది, 12 త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ను సీబీఎస్ఈ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ప్రైవేటు విద్యార్థుల‌కు ప‌ది, 12 త‌ర‌గ‌తుల బోర్డు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఆగ‌స్టు 16 నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు జ‌ర‌ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఉన్న‌త విద్యలో ప్ర‌వేశాల‌కు విద్యార్థుల‌కు ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆయా ఫ‌లితాల‌ను త్వ‌ర‌గా వెల్ల‌డిస్తామ‌ని పేర్కొంది. మ‌రోవైపు ర‌ద్దు చేసిన ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను వెల్ల‌డించేందుకు సీబీఎస్ఈ సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లోనే ఆయా ఫ‌లితాలను ప్ర‌క‌టించ‌నుంది.   

Posted Date : 21-07-2021