• facebook
  • whatsapp
  • telegram

ప్రలోభాలకు లొంగకండి: టీఎస్‌పీఎస్సీ  

 


 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు సంఘవిద్రోహ శక్తులు చెబుతున్న తప్పుడు మాటలను నమ్మవద్దని నిరుద్యోగులను టీఎస్‌పీఎస్సీ కోరింది. ఇలాంటి మోసగాళ్ల గురించి అభ్యర్థులు  vigilance@tspsc.gov.in ఈ-మెయిల్‌ ఐడీకి సమాచారమివ్వాలని పేర్కొంది. ఫిర్యాదు చేసిన అభ్యర్థుల విషయాల్లో గోప్యత పాటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను కొందరు మోసం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్‌ ఈ ప్రకటన విడుదల చేశారు.

Posted Date : 24-07-2021