• facebook
  • whatsapp
  • telegram

అందుబాటులోకి ఇగ్నో టీఈఈ హాల్ టికెట్లు 

 

డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, స‌ర్టిఫికెట్‌ కోర్సుల‌కు సంబంధించి ఇందిరాగాంధీ జాతీయ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం(ఇగ్నో) నిర్వ‌హించే జూన్ ట‌ర్మ్ ఎండ్ ఎగ్జామినేష‌న్‌(టీఈఈ) హాల్ టికెట్లు అందుబాటులోకి వ‌చ్చాయి. అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను ఇగ్నో వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. జూన్ ట‌ర్మ్ ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 3 నుంచి సెప్టెంబ‌ర్ 9 వ‌ర‌కు ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష రెండు విడ‌త‌ల్లో ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జరుగుతుంది. అనివార్య కార‌ణాల‌తో ఆగ‌స్టులో ప‌రీక్ష‌లకు హాజ‌రుకాని విద్యార్థులు డిసెంబ‌రులో రాయ‌వ‌చ్చ‌ని ఇగ్నో తెలిపింది. ఆగ‌స్టులో బ్యాక్‌లాగ్ ప‌రీక్ష‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. 

వెబ్‌సైట్‌: http://ignou.ac.in/

Posted Date : 29-07-2021