• facebook
  • whatsapp
  • telegram

ఫిబ్ర‌వ‌రిలో గేట్‌-2022

 

ఎంటెక్‌లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్‌(గేట్‌)-2022 ప‌రీక్ష తేదీల‌ను ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ఖ‌రారు చేసింది. మొత్తం నాలుగు రోజులు ప‌రీక్ష నిర్వ‌హించ‌నుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 5, 6, 12, 13 తేదీల్లో ప‌రీక్ష జ‌రుగుతుంద‌ని ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది నుంచి గేట్ ప‌రీక్ష‌లో కొత్త‌గా రెండు పేప‌ర్లు చేర‌నున్నట్లు సంస్థ తెలిపింది. కొత్త‌గా జియోమేటిక్స్ ఇంజినీరింగ్‌(జీఈ), నేవ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్‌(ఎన్ఎం) పేప‌ర్ల‌ను చేరుస్తున్న‌ట్లు పేర్కొంది. వీటితో మొత్తం పేప‌ర్ల సంఖ్య 29కి చేరింది. అలాగే గేట్ ద‌ర‌ఖాస్తుల‌కు బీడీఎస్‌, ఎంఫార్మా చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చ‌ని ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ వివ‌రించింది. 

Posted Date : 29-07-2021