• facebook
  • whatsapp
  • telegram

ఐసెట్‌ దరఖాస్తుల గడువు ఆగస్టు 5

 

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (టీఎస్‌ఐసెట్‌-2021)కు దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఈ మేరకు ఐసెట్‌-2021 కన్వీనర్, కేయూ వాణిజ్యశాస్త్రం ఆచార్యులు కె.రాజిరెడ్డి జులై 31న ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆగస్టు 5వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలను ఐసెట్‌ -2021 వెబ్‌సైట్‌లో చూడవచ్చని రాజిరెడ్డి సూచించారు. కొవిడ్‌ కారణంగా డిగ్రీ పరీక్షలు పూర్తికాక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Posted Date : 31-07-2021