• facebook
  • whatsapp
  • telegram

NEST: అందుబాటులో నెస్ట్‌-2021 అడ్మిట్ కార్డులు 

నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌)-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు నెస్ట్ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆగ‌స్టు 14న ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ పరీక్ష ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐఎస్ఈఆర్) భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స‌లెన్స్‌ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశం పొందవచ్చు. ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హిస్తారు. ఆబ్జెక్టివ్ ప‌ద్ధ‌తిలో ప్ర‌శ్న‌లుంటాయి. ప‌రీక్ష‌ రెండు సెషన్లలో జ‌రుగుతుంది. 

వెబ్‌సైట్‌: https://www.nestexam.in/

Posted Date : 07-08-2021