• facebook
  • whatsapp
  • telegram

PG: పీజీ మెడికల్‌ సీట్ల కేటాయింపులన్నీ కేంద్రం పరిధిలోనే!

దిల్లీ: పీజీ మెడికల్‌ సీట్ల కేటాయింపులన్నీ కేంద్రం పరిధిలోకే వచ్చేలా రూపొందించిన ముసాయిదా బిల్లును ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం ప్రతిపాదన.. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్రాల స్వేచ్ఛను హరించేలా ఉందని ఆక్షేపించింది. ముసాయిదా ప్రకారం.. మెడికల్‌ సీట్ల భర్తీ అంతా కేంద్రమే చూసుకుంటుందని, ఇందులో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉందని చెప్పింది. ‘‘సమాఖ్య దేశంలో వైద్య విద్యలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేయడం వినాశకర పరిణామాలకు దారితీస్తుంది’’ అని స్పష్టం చేసింది. పీజీ సీట్ల భర్తీలో ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించాలని కోరింది. విద్యార్థులకు, సమాఖ్య వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి, ప్రజారోగ్యానికి, రోగుల సంరక్షణకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ను డిమాండ్‌ చేసింది.

Posted Date : 10-08-2021