• facebook
  • whatsapp
  • telegram

EWS: ఈ ఏడాది నుంచే ఈడబ్ల్యూఎస్‌ కోటా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యలో 10 శాతం కోటా ఈ విద్యా సంవత్సరం (2021 - 22) నుంచి అమలు చేయనున్నారు. జనరల్‌ కేటగిరీకి చెంది కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారు, 5 ఎకరాలకు మించి పొలాలు లేనివారు, ఇతరత్రా నిబంధనలకు లోబడి ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్‌ (ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌) కోటాను అమలు చేయాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో బీటెక్‌ సీట్లు దాదాపు 90 వేల వరకు ఉంటాయి. అంటే 9 వేల సీట్లు పెరుగుతాయి. ఈసెట్‌లో 900 - 1,000 సీట్లు అదనంగా వస్తాయని ఒక అధికారి తెలిపారు. దీనిపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ కళాశాలల్లో ఉన్న సీట్లకు 10 శాతాన్ని సూమర్‌ న్యూమరరీ కింద పెంచుతామన్నారు. ఆ సీట్లన్నీ కన్వీనర్‌ కోటాలో ఉంటాయన్నారు.

Posted Date : 11-08-2021