• facebook
  • whatsapp
  • telegram

GAT-B: గాట్‌-బి, బీఈటీ-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

బ‌యోటెక్నాల‌జీ, అనుబంధ విభాగాల్లో పీజీ ప్ర‌వేశాల‌కు జాతీయ స్థాయిలో నిర్వ‌హించే గాట్‌-బి/ బీఈటీ-2021 అడ్మిట్ కార్డులు విడుద‌ల‌య్యాయి. అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 14న జ‌ర‌గ‌నున్నాయి. గాట్‌-బి ప‌రీక్ష ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, బీఈటీ ప‌రీక్ష మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. ప‌రీక్ష స‌మ‌యం 3 గంట‌లు. ప్ర‌శ్న‌ప‌త్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఆయా ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్‌) పొందుతారు.

వెబ్‌సైట్‌: https://dbt.nta.ac.in/

Posted Date : 11-08-2021