• facebook
  • whatsapp
  • telegram

TSLAWCET: టీఎస్ లాసెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

టీఎస్ లాసెట్‌-2021 అడ్మిట్ కార్డులు విడుద‌లయ్యాయి. అభ్య‌ర్థులు లాసెట్ వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్‌కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లాసెట్ ద్వారా 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎంలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈసారి మొత్తం 39,866 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆగ‌స్టు 23, 24 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష జరగనుంది. మూడేళ్ల లాసెట్‌కు 28,904 మంది అభ్యర్థులు, అయిదేళ్ల లాసెట్‌కు 7,676 మంది.. పీజీ లాసెట్‌కు 3,286 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఈసారి ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హిస్తోంది. 

వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/ 

Posted Date : 12-08-2021