• facebook
  • whatsapp
  • telegram

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

 

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువును పెంచుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఆగస్టు 12న  తెలిపారు. డిగ్రీలో బీఏ/బీకాం/బీఎస్సీలతో పాటు పీజీలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ గడువును ఆగస్టు 27 వరకు పొడిగించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, రుసుం తదితర వివరాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. ఇతర వివరాలకు 73829 29570/580 నంబర్లలో లేదా విశ్వవిద్యాలయ సమాచార కేంద్రానికి చెందిన 23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.  

Posted Date : 12-08-2021