• facebook
  • whatsapp
  • telegram

ICSI: సీఎస్ ప‌రీక్ష తేదీలో మార్పులేదు

 

కంపెనీ సెక్ర‌టరీస్(సీఎస్‌) జూన్-2021 ప‌రీక్షల‌ తేదీలో ఎలాంటి మార్పు లేద‌ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌టరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) స్ప‌ష్టం చేసింది. షెడ్యూలు ప్ర‌కారం సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెష‌నల్ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 10న ప్రారంభం అయ్యాయి. ఇవి ఆగ‌స్టు 20న ముగియాల్సి ఉండ‌గా.. అ రోజు మొహ‌ర్రం ఉంది. దీంతో ప‌రీక్ష జ‌ర‌గ‌ద‌న్న సందేహాల నేప‌థ్యంలో ఐసీఎస్ఐ క్లారిటీ ఇచ్చింది. ఆగ‌స్టు 20న ప‌రీక్ష య‌థాత‌థంగా జ‌రుగుతుంద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం ఇందిరాగాంధీ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం(ఇగ్నో) సైతం ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. మొహ‌ర్రం రోజు ప‌రీక్ష తేదీలో మార్పు లేద‌ని, షెడ్యూలు ప్ర‌కార‌మే జ‌రుగుతుంద‌ని ఇగ్నో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Posted Date : 14-08-2021