• facebook
  • whatsapp
  • telegram

UPSC: జూన్‌ 5న సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

‣ 2022 సెప్టెంబరు 16 నుంచి ప్రధాన పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో పలు ఉద్యోగ పరీక్షల కాలపట్టికను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) విడుదల చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌(ప్రాథమిక పరీక్ష) 2022 జూన్‌లో ఉంటుంది. మెయిన్‌ పరీక్షలను సెప్టెంబరులో నిర్వహిస్తారు. ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌, ఎన్‌డీఏ, ఫారెస్ట్‌ సర్వీసెస్‌, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ తదితర మొత్తం 24 ఉద్యోగ పరీక్షల తేదీలను ఖరారు చేసి యూపీఎస్‌సీ కాలపట్టికను జారీ చేసింది. అలాగే సివిల్స్‌-2021 ప్రిలిమ్స్‌ను అక్టోబరు 10న, మెయిన్‌ పరీక్షలను 2022 జనవరి 7, 8, 9, 15, 16 తేదీల్లో నిర్వహిస్తారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌-2021 మెయిన్‌ పరీక్షలు 2022 ఫిబ్రవరి 27వ తేదీన మొదలై మార్చి 8తో ముగుస్తాయి.

 

Posted Date : 16-08-2021