• facebook
  • whatsapp
  • telegram

APPSC: గ్రూప్‌-2 ఉద్యోగాల తుది ఎంపిక జాబితా విడుద‌ల‌

అమరావతి: ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్‌-2లోని కో ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు సహకారశాఖ  కమిషనర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. apcooperation.nic.in వెబ్‌సైట్‌లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను ఉంచినట్టు వెల్లడించారు. 10/99లో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ ఫలితాలను వెల్లడించినట్టు స్పష్టం చేశారు. ఆగ‌స్టు 26న గుంటూరు నగరంలోని సహకార కమిషనర్‌ కార్యాలయంలో ధ్రువపత్రాల తనిఖీ ఉంటుందని ఏపీ సహకారశాఖ కమిషనర్‌ స్పష్టం చేశారు.

Posted Date : 18-08-2021