• facebook
  • whatsapp
  • telegram

JNTUH: ప్ర‌త్యామ్నాయ స‌బ్జెక్టుగా భార‌త రాజ్యాంగం

 

జేఎన్‌టీయూ, అనుంబంధ క‌ళాశాల‌ల్లో బీటెక్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్ర‌త్యామ్నాయ స‌బ్జెక్టుగా భార‌త‌ రాజ్యాంగాన్ని బోధించేందుకు జేఎన్‌టీయూ హైద‌రాబాద్ అనుమ‌తినిచ్చింది. ఈమేర‌కు జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ డా.ఎం.మంజూర్ హుస్సేన్‌ ఆయా క‌ళాశాలల ప్రిన్సిపాళ్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. 2020-21 విద్యాసంవ‌త్స‌రంలో ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, ఇంటిగ్రేటెడ్ ప్రాప‌ర్టీ రైట్స్ స‌బ్జెక్టుల‌ను ఎంచుకున్న విద్యార్థులు వాటి స్థానంలో ప్ర‌త్యామ్నాయ స‌బ్జెక్టుగా వ‌చ్చే సంవత్స‌రం నుంచి భార‌త రాజ్యాంగాన్ని చ‌ద‌వ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇది సీఈ, ఎంఈ, ఈఈఈ, సీఎస్ఈ, ఐటీ త‌దిత‌ర బ్రాంచిల విద్యార్థుల‌కు వ‌ర్తిస్తుంద‌న్నారు. 

Posted Date : 19-08-2021