• facebook
  • whatsapp
  • telegram

హేతుబద్ధీకరణ తర్వాతే మిగులు పోస్టులు తెలిసేది  

* పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన
ఈనాడు, హైదరాబాద్‌: హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉపాధ్యాయుల మిగులు పోస్టులు ఎన్నో స్పష్టంగా తెలుస్తాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన తెలిపారు. గత ఆగ‌స్టు 11న‌ ఈనాడులో ‘పాఠశాలల విలీనం’, ‘6 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై ఆమె స్పందించారు. ‘‘హేతుబద్ధీకరణ వల్ల 6 వేల ఉపాధ్యాయ పోస్టులు మిగులు (సర్‌ప్లస్‌) ఖాతాలోకి వెళతాయన్నది ఊహాజనితమే. ఇప్పటివరకు వాటిని లెక్కించలేదు. జీవోలో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లకు సంబంధించి రద్దు అనే పదం వాడలేదు. తెలుగుతోపాటు ఆంగ్ల మాధ్యమం కొనసాగుతూ అందులో 50 మంది లోపు పిల్లలు ఉంటే.. ఆ ఆంగ్ల మాధ్యమ సెక్షన్‌ను సమీపంలోని మరో ఆంగ్ల మాధ్యమ బడిలో కలుపుతాం. ఇదంతా తగినంత ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే’’ అని పేర్కొన్నారు.
 

Posted Date : 20-08-2021