• facebook
  • whatsapp
  • telegram

మెరిట్‌ విద్యార్థులకు ఖరగ్‌పూర్‌ ఐఐటీ స్కాలర్‌షిప్‌ 

 

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్షలో మొదటి వంద ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో చేరితే వారికి స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు ఐఐటీ డైరెక్టర్‌ ఆచార్య వి.కె.తివారి తెలిపారు. ఆ విద్యార్థి బీటెక్‌ చదువు పూర్తయ్యేవరకు అన్ని ఖర్చులను ఐఐటీ భరిస్తుందని పేర్కొన్నారు. దీనికి విద్యాసాగర్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించారు.

Posted Date : 20-08-2021